అవినీతిపై వ్యతిరేక పోరాటం.. ఆరోజే మొదలు! | Kamal Haasan Indian 2 Release Date Out Now | Sakshi
Sakshi News home page

Indian 2: భారతీయుడు 2 రాబోతున్నాడు.. తప్పును అస్సలు భరించడు!

Apr 6 2024 8:56 PM | Updated on Apr 6 2024 8:56 PM

Kamal Haasan Indian 2 Release Date Out Now - Sakshi

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ రూపొందుతోంది.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమాను జూన్ నెల‌లో విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తెల్ల‌టి ధోతి, కుర్తాలో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం అంటే ఎంత స్వ‌చ్చంగా ఉండాలో అంత‌టి స్వ‌చ్చ‌త పోస్ట‌ర్‌లో ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది.

జీరో టాల‌రెన్స్ (త‌ప్పును అస్స‌లు భ‌రించ‌లేను) అన్న లైన్ చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌ కాగా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement