కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్బంగా ఫ్యాన్స్కు కానుక ఇవ్వనున్నారు. నవంబర్ 7న ఆయన బర్త్డే సందర్బంగా విక్రమ్ సినిమా రీరిలీజ్ కానుంది. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. దాదాపు అయిదు భాషల్లో సత్తా చాటింది. తమిళనాడులో కలెక్షన్లపరంగా అనేక రికార్డ్లను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 400కోట్లు పైగా వసూలు చేసి కమల్ కెరీర్‌లోనే భారీగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి థియేటర్‌లోకి విక్రమ్ రానున్నడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్లో కమల్‌కు దీటుగా విజయ్ సేతుపతి(Vijay sethupathi), ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) కీలక పాత్రల్లో మెప్పించారు. సినిమా చివర్లో రోలెక్స్‌గా సూర్య మెరుపులు అదరగొట్టేశారు. అయితే, కమల్ బర్త్‌డే సందర్భంగా విక్రమ్ స్పెషల్ షోలు వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్లోని విమల్ (మైత్రీ మూవీస్) థియేటర్ ఒక పోస్టర్ షేర్ చేసింది. ఆపై ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్యలో కూడా విక్రమ్ షో ఉండనుంది. విజయవాడ అలంకార్, వైజాగ్ సంగం థియేటర్స్‌కు సంబంధించి ఇప్పటికే టికెట్లు ఓపెన్ అయ్యాయి.


