SS Rajamouli: ఆ కథ వేరేవాళ్లకు ఇవ్వడంతో రాజమౌళి కంట్లో నీళ్లు తిరిగాయి

K V Vijayendra Prasad Says SS Rajamouli Tears for Bajrangi Bhaijaan Story, Deets Inside - Sakshi

తెలుగు ఇండస్ట్రీకి చిరకాలం గుర్తుండిపోయే హిట్లను అందించాడు స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌. తన కుమారుడు రాజమౌళి ప్రతి సినిమాకీ కథ అందిస్తున్న ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు కూడా రచయితగా పని చేశారు. తాజాగా ఆయన మూవీ ప్రమోషన్లలో భాగంలో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తను రాసిన కథ వేరొకరికి ఇచ్చినప్పుడు రాజమౌళి బాధపడ్డాడని పేర్కొన్నారు.

'భజరంగీ భాయ్‌జాన్‌ కథ సల్మాన్‌కు చెప్పాననగానే రాజమౌళి కళ్లలో నీళ్లు తిరిగాయి. అతడు కంటనీరు పెట్టుకోవడం చూసి ఆ కథ నీకు ఉంచేయనా? అని అడిగాను. కానీ అతడు లేదు, వారికే ఇచ్చేయండి అని చెప్పాడు. చివరకు ఈ సినిమా రిలీజయ్యాక నా కొడుకు ఏమన్నాడంటే.. బాహుబలి పార్ట్‌ 1లో రెండు వేల మంది ఆర్టిస్టులతో ఫైట్‌ సీన్‌ జరుగుతోంది. అది రోహిణి కార్తె, ఎండలు మండిపోతున్నాయి. మంచి కాక మీదున్నప్పుడు అడిగారు. 15 రోజులు ముందో లేదా 15 రోజులు తర్వాతో అడిగినా ఆ కథ నేనే తీసేవాడిని అన్నాడు' అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్‌. ఇక ఈ సినిమా మొదట ఆమిర్‌ ఖాన్‌కు వినిపించగా ఆయన కథ బాగుందన్నాడు కానీ పాత్రకు కనెక్ట్‌ కాలేకపోతున్నానని తిరస్కరించాడని తెలిపారు. ఆ తర్వాత ఇది సల్మాన్‌ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ రాకతో సైడ్‌ అయిపోయిన సినిమాలు, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top