'హ్యాపీ బర్త్‌ డే మై బ్రదర్'.. దేవర స్పెషల్ విషెస్! | Jr Ntr Special Wishes To Ram Charan Birthday Post Goes Viral | Sakshi
Sakshi News home page

Jr Ntr: 'హ్యాపీ బర్త్‌ డే మై బ్రదర్'.. జూనియర్ స్పెషల్ విషెస్!

Mar 27 2024 4:52 PM | Updated on Mar 27 2024 5:06 PM

Jr Ntr Special Wishes To Ram Charan Birthday Post Goes Viral - Sakshi

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ బర్త్‌ డే కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్‌తో ముంచెత్తుతున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ సైతం హ్యాపీ బర్త్‌ డే మై డియరెస్ట్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. 

తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం చెర్రీకి బర్త్‌ డే విషెస్ తెలిపింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీన్స్‌ను కలిసి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించింది. అంతే కాకుండా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement