
‘‘జాతస్య మరణం ధ్రువం’ పేరు సజెస్ట్ చేసింది నేనే. టైటిల్ క్రెడిట్ నాకే వస్తుంది (నవ్వుతూ). మలయాళం నుంచి వచ్చే సినిమాలు బావుంటాయని అంటాం. మా ‘జాతస్య మరణం ధ్రువం’ ఆ కోవకి చెందిన సినిమా... అందరికీ నచ్చుతుంది’’ అని జేడీ చక్రవర్తి తెలిపారు. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్, ప్రీతీ జంగియాని ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించారు.
ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే, ట్విస్టులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘చాలా బలమైన స్క్రిప్ట్ ఇది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది’’ అని శ్రవణ్ జొన్నాడ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని సీరత్ కపూర్ చెప్పారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘΄ాన్ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన ఈ సినిమాని అదే స్థాయిలో విడుదల చేస్తాం’’ అని తెలి΄ారు.