ఆ అదృష్టం నాకు దక్కింది: జేడీ చక్రవర్తి | JD Chakravarthy Speech at Gaayapadda Simham Movie Event | Sakshi
Sakshi News home page

ఆ అదృష్టం నాకు దక్కింది: జేడీ చక్రవర్తి

Apr 7 2026 12:10 AM | Updated on Apr 7 2026 12:10 AM

JD Chakravarthy Speech at Gaayapadda Simham Movie Event

పవన్‌ సాధినేని, కశ్యప్‌ శ్రీనివాస్, జేడీ చక్రవర్తి, భానుకిరణ్‌

‘‘యాక్టర్స్‌ అందరికీ కమల్‌ హాసన్‌గారు ఒక కొలమానం. ఆయన చేసినన్ని క్యారెక్టర్లు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చేయలేదు, చేయబోరు. అయితే  ‘గాయపడ్డ సింహం’ మూవీలో నేను  పోషించిన ధర్మ పాత్ర నా కెరీర్‌లో గుర్తుండి పోతుంది. నటుడిగా కాదు కానీ, క్యారెక్టర్‌ పరంగా చూస్తే ధర్మలాంటి పాత్ర చేసే అదృష్టం కమల్‌ హాసన్‌గారికి దక్కలేదు.. ఆ అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నాను’’ అని నటుడు జేడీ చక్రవర్తి తెలిపారు. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా, మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’.

డైరెక్టర్‌ పవన్‌ సాధినేని సమర్పణలో స΄్తాశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్‌ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సాల్‌ నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదలవుతోంది. ఈ మూవీలో సీనియర్‌ నటుడు జేడీ చక్రవర్తి  పోషించిన బ్రూటల్‌ ధర్మ పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో ‘మనీ, సత్య, అనగనగా ఒక రోజు’ లాంటి చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్‌ చేసే అవకాశం ‘గాయపడ్డ సింహం’లో దొరికింది. మా సినిమా ‘దిల్‌’ రాజు గారికి నచ్చడం సంతోషం. మా మూవీని ఆడియన్స్ ఎంజాయ్‌ చేస్తారు’’ అని పేర్కొన్నారు.

‘‘మా సినిమాని మేము ఎంత ఎంజాయ్‌ చేశామో, ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు పవన్‌ సాధినేని. ‘‘జేడీగారి బెస్ట్‌ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్‌ ధర్మ పాత్రలో కనిపిస్తాయి’’ అన్నారు కశ్యప్‌ శ్రీనివాస్‌. ‘‘జేడీ చక్రవర్తిగారు సత్య పాత్రతో ఎంత పాపులర్‌ అయ్యారో ధర్మ క్యారెక్టర్‌లోనూ అంతే పాపులర్‌ అవుతారని నమ్ముతున్నాను’’ అని భాను కిరణ్‌ ప్రతాప చె ప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement