Jaya Bachchan was told only her prayers can help 'clinically dead' Amitabh Bachchan - Sakshi
Sakshi News home page

Jaya Bachchan: దేవుడిని ప్రార్థించడం తప్ప.. ఏం చేయలేమన్నారు: జయా బచ్చన్

Jun 3 2023 9:25 AM | Updated on Jun 3 2023 1:36 PM

Jaya Bachchan was told only her prayers can help clinically dead Amitabh Bachchan - Sakshi

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్‌ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో బిగ్‌ బీగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన భార్య జయా బచ్చన్ తమ జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో వచ్చిన కూలీ సినిమా సెట్స్‌లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని తలుచుకుని ఎమోషనలయ్యారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన కళ్లముందు కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో దేవున్ని ప్రార్థించడం తప్ప తనకేలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఇవాళ జయ- ‍ అమితాబ్ 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

(ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్‌ విరగబడి నవ్వింది)

దేవుడిని ప్రార్థించమన్నారు: జయా బచ్చన్

జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను ఆసుపత్రికి వెళ్లగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అ‍ప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాం.' అని జయా బచ్చన్ ఆనాటి సంఘటనను వివరించారు. కాగా.. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించారు. 

అసలేం జరిగిందంటే...

అమితాబ్ బచ్చన్ 1982 ఆగస్టు 2న కూలీ సెట్స్‌లో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో నటుడు పునీత్ ఇస్సార్‌తో ఫైట్ సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది.  పొత్తికడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా చికిత్సకు స్పందించలేదు. వెంటిలేటర్‌పై ఉంచేముందు ఆయన కోసం దేవున్ని ప్రార్థించడమే తప్ప ఏం చేయలేమని డాక్టర్‌ చెప్పారని ఆ రోజు భయానక పరిస్థితిని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. 

(ఇది చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement