
'హిట్ 3'లో అర్జున్ సర్కార్ పాత్రతో స్టార్ హీరో నాని నేడు థియేటర్స్‌లోకి వచ్చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్‌లు రెండూ కమర్షియల్‌గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో హిట్ 3 (HIT 3)పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతి సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ హీరోను దర్శకుడు రివీల్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే హిట్ ఫోర్త్ కేస్‌ను హీరో కార్తీ పూర్తి చేస్తాడని క్లూ ఇచ్చేశారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో కార్తీ పేరు వైరల్ అవుతుంది.
ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఛార్జ్ తీసుకున్నారని హిట్-3లో ప్రకటించారు. దీంతో హిట్-4లో కార్తీ ఫైనల్ అయినట్లు తెలిసిపోయింది. రానున్న సీక్వెల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా గతంలో పలు సినిమాల్లో కార్తీ దుమ్మురేపాడు. ‘హిట్ 4’లో కార్తీ హీరో అని కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కార్తీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారని వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అదే నిజం అయిందని చెప్పవచ్చు.

అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.
Karthi’s cameo as Rathnavel Pandian in #HIT3 was a total show-stealer! 👮♂️🔥 That powerful entry has us hyped for what’s next. Bring on #HIT4! 💥 #Nani #SrinidhiShetty #SaileshKolanu#HIT3TheThirdCase #HIT3 pic.twitter.com/GvThz38uBf
— Movie Munch (@dailyaffairs12) May 1, 2025