హిట్‌3 బ్రేక్ ఈవెన్‌ మార్క్‌.. రెండురోజుల్లోనే భారీ కెలెక్షన్స్‌ | HIT 3 Movie Second Day Collection Details | Sakshi
Sakshi News home page

హిట్‌3 బ్రేక్ ఈవెన్‌ మార్క్‌.. రెండురోజుల్లోనే భారీ కెలెక్షన్స్‌

May 3 2025 11:34 AM | Updated on May 3 2025 12:19 PM

HIT 3 Movie Second Day Collection Details

'హిట్‌3: ది థర్డ్‌ కేస్‌' సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద  హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్‌ రాబట్టి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రెండోరోజు కూడా హిట్‌3 మూవీ షాకింగ్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు.

హిట్‌3 సినిమా కేవలం రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  ఫస్ట్‌ డే రూ. 43 కోట్లు, సెకండ్‌ డే రూ. 19 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం వీకెండ్‌ సెలవలు ఉన్నాయి కాబట్టి ఆదివారం పూర్తి అయ్యే సరికి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు.

 దానిని నిజం చేస్తూ.. ఈరోజు, రేపటికి ముందస్తు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఓవర్సీస్‌లో కూడా 1.5 మిలియన్ల డాలర్స్‌ దాటింది. ఇప్పటి వరకు  నాని నటించిన 11 సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఈ సినిమా వారంలోపే  బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ను అందుకుంటుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఇటీవలి తెలుగు సినిమా చరిత్రలో అత్యంత వేగంగా లాభాలను ఆర్జించిన వాటిలో హిట్‌3 ఒకటి.

Advertisement
 
Advertisement
Advertisement