
Actress Anjali Latest Photos: దక్షిణాదిలో తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్‌గా నటించి, మెప్పించి హోమ్లీ గర్ల్ అని మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు అంజలి. ఈమె ఇప్పుడు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో కాస్త అంత విరామం తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించడం మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్‌లలోనూ అందాలను ఆరబోసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రామ్‌చరణ్‌తో దర్శకుడు శంకర్ నిర్మిస్తున్న చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తోంది.
నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించింది. ప్రస్తుతం విదేశాల పర్యటనకు వెళ్లిన ఈ సుందరి అక్కడి నుంచి తన నాజూకుతనాన్ని చూపుతూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి.