హీరోగా మ్యూజిక్‌ డైరెక్టర్‌.. మరో హర్రర్‌ చిత్రం '13' | Sakshi
Sakshi News home page

13 Movie: డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌తో సంగీత దర్శకుడి రెండో చిత్రం..

Published Tue, May 31 2022 2:40 PM

GV Prakash Kumar Gautham Menon Reunite For 13 Movie - Sakshi

చెన్నై సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ 'డార్లింగ్‌' (తమిళం) చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. జీవీ ప్రకాష్‌ కుమార్ తాజాగా నటిస్తోన్న చిత్రం '13'. ఇటీవల జీవీ ప్రకాష్‌ కుమార్, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కలిసి నటించిన 'సెల్ఫీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి '13' మూవీలో నటించడం విశేషం. దీన్ని ఎస్‌. నందగోపాల్‌ సమర్పణలో మద్రాస్‌ స్టూడియోస్, అన్షు ప్రభాకర్‌ ఫిలిమ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. 

షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి జీవీ ప్రకాష్‌ కుమార్‌ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్‌ ఫోన్‌ చేసి మంచి హారర్‌ కథ ఉంది దర్శకుడు చెబుతారు వినమని  చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్‌ నేపథ్యంలో డార్లింగ్‌ చేయడంతో కాస్త సందేహించానన్నారు. అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించానని, ఇది హర్రర్‌ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర  టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు.

చదవండి:👇
రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్‌ అరెస్ట్‌..

ఎన్టీఆర్‌ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్‌ రావిపూడిAdvertisement
 
Advertisement