గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే! | Sakshi
Sakshi News home page

శ్రీనువైట్ల-గోపీచంద్ యాక్షన్ సినిమా.. ఈసారైనా హిట్ కొడతారా?

Published Thu, Apr 11 2024 5:27 PM

Gopichand Srinu Vaitla Viswam Movie Teaser - Sakshi

శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది.

(ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!)

అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు.

తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement