గోపీచంద్ 'భీమా' టాక్‌ ఎలా ఉందంటే.. | Gopichand Bhimaa Movie Twitter Review | Sakshi
Sakshi News home page

గోపీచంద్ 'భీమా' టాక్‌ ఎలా ఉందంటే..

Mar 8 2024 9:05 AM | Updated on Mar 8 2024 12:17 PM

Gopichand Bhimaa Movie Twitter Review - Sakshi

 గోపీచంద్ హీరోగా న‌టించిన భీమా నేడు (మార్చి 8) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ఏ హ‌ర్ష ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందొ పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

భీమా భారీ యాక్ష‌న్ మూవీ అని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతున్నారు. గోలీమార్‌ తర్వాత మరోసారి పోలీస్‌ అవతారంలో గోపీచంద్‌ మెప్పించాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్‌కు ఈ సినిమా కాస్త రిలీఫ్‌ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా గోపీచంద్ క‌టౌట్‌గా త‌గ్ క‌థ భీమాతో కుదిరిందని నెటిజన్లు అంటున్నారు. డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లోగోపీచంద్ తన అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చారని పేర్కొంటున్నారు. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్‌లో గోపీచంద్‌ శివతాండవం చేశాడని నెట్టింట వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా గోపీచంద్‌కు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా కొంత మేరకు తోడు కావడంతో సినిమాకు మరింత హైప్‌ క్రియేట్‌ అయింది.

భీమా సినిమాకు ప్రధానంగా యాక్ష‌న్ సీక్వెన్స్‌లు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్ అని నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు. కేజీఎఫ్‌, సలార్‌ రేంజ్‌లో ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ అందించిన బీజీఎమ్ పీక్స్‌కు వెళ్తుందని ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా సీన్స్‌కు ఆయన ఇచ్చిన ఎలివేషన్‌ బీజీఎమ్‌తోనే సినిమాకు మేజర్‌ ప్లస్‌ అయిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్‌లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా రికార్డుకెక్కింది. భీమాతో గోపీచంద్ మ‌ళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వ‌చ్చాడ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయగా ఫ్యాన్స్‌కు మాత్రం భీమాతో బిగ్గెస్ట్‌ ట్రీట్‌ ఇచ్చాడని తెలుపుతున్నారు.  యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారిని గ్యారెంటీగా భీమా మెప్పిస్తుందని కామెంట్ల చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement