చిన్న వయసులోనే చనిపోయిన నటుడు | Game Of Thrones Actor Michael Patrick | Sakshi
Sakshi News home page

Michael Patrick: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటుడి అకాలమరణం

Apr 9 2026 11:50 PM | Updated on Apr 10 2026 9:49 AM

Game Of Thrones Actor Michael Patrick

ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్‌తో చాలామంది నటీనటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులోనే నటించి ఐరిష్ నటుడు ఇప్పుడు చిన్న వయసులోనే కన్నుమూశాడు. ఐర్లాండ్‌కి చెందిన మైకేల్ పాట్రిక్(35) గత మూడేళ్లుగా మోటార్ న్యూరోన్ అనే వ్యాధితో పోరాడుతున్నాడు. పదిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన పాట్రిక్.. చికిత్స పొందుతూ మంగళవారం(ఏప్రిల్ 7) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి భార్య ధ్రువీకరించింది.

తన ఆరోగ్యం గురించి గత కొన్నాళ్లుగా మాట్లాడుతూనే ఉన్న పాట్రిక్.. ఫిబ్రవరి 6న చివరగా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన పరిస్థితి గురించి వివరంగా చెప్పిన వైద్యులు.. మరో ఏడాది మాత్రమే తనకు మిగిలుందని చెప్పినట్లు రాసుకొచ్చాడు.
ట్రాచియోస్టమీ సర్జరీ గురించి ఆలోచించినప్పటికీ, దాని తర్వాత చాన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందనే కారణంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపాడు.

మోటార్ న్యూరోన్ అనేది శరీర కండరాల పనితీరును నియంత్రించే నాడీ కణాలను దెబ్బతీసే తీవ్రమైన నరాల వ్యాధి. దీని వల్ల నడవడం, మాట్లాడటం, మింగడం, గాలి పీల్చడం లాంటివి క్రమంగా క్షీణిస్తాయి. ఇకపోతే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌తో పాటు బెల్ ఫెస్ట్ సినిమాలోనూ నటించాడు. టీవీ, థియేటర్ రంగంలోనూ ప్రతిభ చాటుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement