‘లైగర్‌’ పెట్టుబడులపై ఈడీ దూకుడు

Enforcement Directorate Inquiry In Investments In Liger Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లైగర్‌ చిత్రానికి పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్‌ ఇండియా సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, శుక్రవారం సినీ ఫైనాన్షియర్‌ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్‌ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమా పెట్టుబడులపై ఇదివరకు పూరీ జగన్నాథ్, చార్మి, విజయ్‌ను ప్రశ్నించినప్పుడు, శోభన్‌ను ప్రశ్నించినప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి: విజయ్‌కి ‘లైగర్‌’ సెగ!

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top