పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌..విశాల్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

eddy Actors Arya And Sayyeshaa Blessed With Baby Girl, Celebrities Pour Wishes - Sakshi

కోలీవుడ్ హీరో ఆర్య భార్య, హీరోయిన సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

‘ఈ  వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్‌ ట్వీట్ చేశాడు. కాగా, ఆర్య, విశాల్‌ కలిసి ప్రస్తుతం ‘ఎనిమీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరబాద్‌లో జరుగుతుంది. 

ఆర్య, సయేషా​ సైగల్‌లది ప్రేమ వివాహం. ‘అఖిల్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత ‘గజినీకాంత్' అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ఆర్యతో ప్రేమాయణం సాగించింది. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top