
‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం..
ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొడుతూ. ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తెరకెక్కించారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్, పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐని వాడుకుని గొప్పగా చూపించారు. ఇంటర్నేషనల్ వైడ్‌గా డాక్యుమెంటరీలను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తుంటారు. డాక్యుమెంటరీ అనేది దృశ్యరూపంలో ఉండే చరిత్ర. ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తాను. యశ్వంత్ మ్యూజిక్, నిఖిల్ కెమెరా వర్క్ గొప్పగా వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.