12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Dhanya Balakrishna: వాళ్లకు క్షమాపణ చెప్పిన హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Published Fri, Feb 2 2024 4:48 PM

Dhanya Balakrishna Apologies Tamil Audience For Facebook Post - Sakshi

యంగ్ హీరోయిన్.. సినీ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పింది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం పెట్టిన పోస్ట్‌పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చేసింది. తనకు తమిళ ఆడియెన్స్ అంటే ఎంతో గౌరవమని చెప్పింది. అలానే అప్పట్లోని స్టేట్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ అప్పుడేం జరిగింది? నటి ధన్య ఇప్పుడెందుకు సారీ చెప్పిందో తెలుసా?

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. డేట్ ఫిక్స్)

బెంగళూరులో పుట్టి పెరిగిన ధన్య బాలకృష్ణ.. తెలుగు, తమిళంలో బోలెడన్ని సినిమాలు చేసింది. హీరోయిన్, సహాయ పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. ఈమె నటించిన 'లాల్ సలామ్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఇప్పుడు ఓ పాత గొడవ బయటకొచ్చింది. గతంలో తమిళ ప్రేక్షకులని కించపరిచేలా 2012లో ఫేస్‌బుక్‌లో ఈమె పోస్ట్ పెట్టిందని చెబుతూ ఓ స్క్రీన్ షాట్‌ని వైరల్ చేశారు. దీని వల్ల తమిళ నెటిజన్స్.. ఈమెకు చుక్కలు చూపించారు. దీంతో ధన్య ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చేసింది.

12 ఏళ్ల పోస్ట్‌లో ఏముంది?
'ప్రియమైన చెన్నై, మీరు అడుక్కుంటే మేం నీళ్లిచ్చాం. మీరు అడుక్కుంటే కరెంట్ ఇచ్చాం. మీరు వచ్చి మా అందమైన నగరాన్ని ఆక్రమించారు. క్షమాపణ చెబితే మేం దయతలచి ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లేలా చేస్తాం. మీరు అడుక్కుంటే మేం ఇస్తాం' అని అప్పట్లో ధన్య బాలకృష్ణ రాసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ స్క్రీన్ షాట్‌పై స్పందించిన నటి ధన్య.. సోషల్ మీడియాలో పెద్ద నోట్ రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఇప్పుడు ఏం చెప్పింది?
'నా వృత్తి, తినే తిండి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ కామెంట్స్ నేను చేయలేదు. అది నా అభిప్రాయం కాదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అది ట్రోలింగ్‌కి సృష్టించిన స్క్రీన్ షాట్. ఇన్నేళ్లు ఎందుకు దీనిపై స్పందించలేదా అని మీరనుకోవచ్చు. కానీ ఇన్నేళ్లలో నాకు, నా కుటుంబానికి చాలా బెదిరింపులు వచ్చాయి. వాళ్లని కాపాడుకోవడంలో భాగంగా నేను సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చింది'

'కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ నేను చేయలేదని పక్కాగా చెబుతున్నాను. నేను తమిళ ఇండస్ట్రీలోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. ఇక్కడ పనిచేస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. నాకు తమిళ ప్రేక్షకులే ఫస్ట్ ఆడియెన్స్. ఓ మహిళగా నేను ఎవరినీ హర్ట్ చేయలేదు. చేయను కూడా. ఈ స్టేట్‌మెంట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తమిళ ప్రేక్షకులందరికీ క్షమాపణ చెబుతున్నాను' అని నటి ధన్య బాలకృష్ణ ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

Advertisement
Advertisement