హాలీవుడ్‌ మూవీలో ధనుష్‌ ఫస్ట్‌ లుక్ ఇదే.. మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే ? | Dhanush The Gray Man Release Date Announced With First Look Poster | Sakshi
Sakshi News home page

Dhanush In The Gray Man Movie: హాలీవుడ్‌ మూవీలో ధనుష్‌ ఫస్ట్‌ లుక్ ఇదే.. మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే ?

Published Wed, Apr 27 2022 1:17 PM | Last Updated on Wed, Apr 27 2022 1:27 PM

Dhanush The Gray Man Release Date Announced With First Look Poster - Sakshi

Dhanush The Gray Man Release Date Announced With First Look Poster: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్' సినిమాతో అలరించిన ధనుష్‌.. తన అభిమానులకు సూపర్‌ గుడ్‌ న్యూస్ ఇచ్చాడు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ధనుష్‌ హాలీవుడ్‌ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి అప్‌డేట్‌ పంచుకున్నాడు. ది గ్రే మ్యాన్ మూవీలోని తన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ 'ది గ్రే మ్యాన్‌.. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో' అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టర్‌లో కారు పైకప్పుపై నుదిటిపై రక్తంతో సీరియస్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు ధనుష్‌. 

బాక్సాఫీసును షేక్‌ చేసిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్‌ (ఆంథోనీ రూసో, జోసెఫ్‌ రూసో) ‘ది గ్రే మ్యాన్‌’కు దర్శకులు. ఇంగ్లీష్‌ యాక్టర్స్‌ ర్యాన్‌ గోస్లింగ్, క్రిస్‌ ఎవాన్స్, అనా డి అర్మాస్‌లతో కలిసి ధనుష్‌ ఈ చిత్రంలో నటించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌ పాత్ర నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. 'ది గ్రే మ్యాన్‌' మూవీ ఈ ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న స్ట్రీమింగ్‌ కానుంది. కాగా 'ది గ్రే మ్యాన్‌' సినిమా ధనుష్‌ రెండో హాలీవుడ్‌ మూవీ. 2018లో వచ్చిన 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌' చిత్రంతో ధనుష్‌ హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: అల్లు అర్జున్‌, ధనుష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్..!
మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్‌ ట్వీట్‌, అంత మాట అనేశాడేంటి!


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement