KRK About Karan Johar : 'కరణ్‌ దివాళా తీశాడు.. ఆయన సాయం చేయడంతో బతికున్నాడు'

Critic KRK Claims Karan Johar Tried To Commit Suicide Tweet Goes Viral - Sakshi

బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర‍్కే) కరణ్‌ జోహార్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు.ఎప్పుడూ వివాదాస‍్పద వ్యాఖ్యలతో వార్తల‍్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ట్వీట్‌ చేశాడు. బ్రహ్మాస్త్ర తో భారీ నష్టాలను చవిచూసిన కరణ్‌జోహార్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ బాంబ్‌ పేల్చాడు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మించాయి.

''ఈ సినిమా ఫలితం, నష్టాలను చూసి కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో డిప్రెషన్‌తో ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తనకు సమాచారం ఉందని కేఆర్‌కే ఆరోపించాడు. ఆ తర్వాత ముఖేష్‌ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే బ్రహ్మాస్త్ర కారణంగా దివాళా తీసినట్లు కరణ్ ఎందుకు ప్రపంచానికి చెప్పట్లేదు'' అంటూ కేఆర్‌కే ప్రశ్నించాడు.

కాగా గతంలో బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్‌ లెక్కలు తప్పిచూపించారని ఆరోపించిన కేఆర్కే ఇప్పుడు కరణ్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేఆర్కే చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top