సైకలాజికల్‌ థ్రిల్లర్‌కి ఫిక్స్‌ | Cinematographer Tirru joins Ram Pothineni’s directorial debut RAPO23 | Sakshi
Sakshi News home page

సైకలాజికల్‌ థ్రిల్లర్‌కి ఫిక్స్‌

Jun 7 2026 12:40 AM | Updated on Jun 7 2026 12:40 AM

Cinematographer Tirru joins Ram Pothineni’s directorial debut RAPO23

రజనీకాంత్‌ ‘పేట్ట’, మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’,    ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’, హృతిక్‌ రోషన్‌ ‘క్రిష్‌ 3’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు తిరునావుక్కరసు (తిరు) సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సంగతి తెలిసిందే. రామ్‌ హీరోగా నటిస్తూ,, స్వీయ దర్శకత్వం వహించనున్న సినిమాకీ ఆయన ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 

రాపో సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో వీర అనే పాత్రలో నటిస్తారు రామ్‌. ‘‘జాతీయ అవార్డు అందుకున్న అనుభవం, విజువల్‌ స్టైల్, ఫ్రేమింగ్, లైటింగ్, సినిమాటిక్‌ టెక్స్టర్‌లపై తిరుకు ఉన్న పట్టు, ఈ సినిమా విజువల్స్‌ మేకింగ్‌లో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement