ఎమోషనల్‌ వీడియో..ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్‌

Chiranjeevi Sarja Wife Meghana Raj Introduces Her Son To World - Sakshi

సాక్షి, బెంగళూరు : కన్నడ నటి మేఘనా రాజ్‌ మొదటిసారిగా తన కొడుకును అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ చిరు(సింబా)అంటూ చిన్నారి పేరును ప్రకటించారు. తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలతో ఒక నిమిషం పాటు నిడివి ఉన్న వీడిమోను మేఘనా షేర్‌ చేశారు. అక్టోబర్ 22, 2017న దివంగత నటుడు చిరంజీవి-మేఘనాల ఎంగేజ్‌మెంట్‌తో వీడియో ప్రారంభం అవుతుంది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అదే రోజున 2020లో మేఘనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 


'నేను పుట్టకముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్న తరుణంలో మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు..నేను మీ జూనియర్‌ సీ' అంటూ మేఘన తన కొడుకును ఇంట్రడ్యూస్‌ చేశారు. ఎంతో ఎమెషనల్‌గా సాగే ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇప్పటికే  ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే వ్యూస్ వచ్చాయి. కాగా  చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూన్‌ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు.  అప్పటికే 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్‌ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు.  36 ఏళ్ల వయసులో చిరంజివి సర్జా గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 

చదవండి : (భర్త కటౌట్‌తో నటి సీమంతం)
(నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: మేఘనా రాజ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top