‘కరూర్‌ తొక్కిసలాట’ ఘటనపై స్పందించిన చిరంజీవి! | Chiranjeevi Response On TVK Vijay Rally Stampede | Sakshi
Sakshi News home page

‘కరూర్‌ తొక్కిసలాట’ ఘటనపై స్పందించిన చిరంజీవి!

Sep 28 2025 11:02 AM | Updated on Sep 28 2025 12:14 PM

Chiranjeevi Response On TVK Vijay Rally Stampede

తమిళనాడు కరూర్‌ తొక్కిసలాట ఘటన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) స్పందించారు. ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్పెట్టారు

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకోవడం చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిఅని చిరంజీవి ట్వీట్చేశాడు.

కాగా,తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్‌(Vijay ) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39 మంది మరణించారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది వరకు చిన్నపిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement