
ఒకవేళ నీ తప్పు లేకుండా ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, నిజం నిలకడగా తెలుస్తుందని నేను నమ్ముతాను. అసలు అక్కడ నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఉలిక్కిపడాలి?
అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని గరికపాటి మెగాస్టార్‌ను బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా చిరంజీవి మరోసారి ఈ వివాదంపై స్పందించాడు. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నాడు.
'నేను వెనక్కు తగ్గలేదు, సంయమనం పాటిస్తున్నాను. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. నేను తప్పు చేయను, తప్పు చేస్తే అందరిముందే పొరపాటు అయిందని ఒప్పుకుంటా. ఒకవేళ నీ తప్పు లేకుండా ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, నిజం నిలకడగా తెలుస్తుందని నేను నమ్ముతాను. అసలు అక్కడ నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఉలిక్కిపడాలి? నన్ను ఎద్దేవా చేసినవారు దగ్గరకు వచ్చినా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటా, ఇదే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి.
చదవండి: కాంతార సెన్సేషన్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 లను దాటేసిందిగా