చిరంజీవికి అభిమాని శుభాకాంక్షలు.. అన్నింటిలో ఇదీ చాలా ప్రత్యేకం | Chiranjeevi Fans Wishes On New York Time Square Wall | Sakshi
Sakshi News home page

చిరంజీవికి అభిమాని శుభాకాంక్షలు.. అన్నింటిలో ఇదీ చాలా ప్రత్యేకం

Jan 30 2024 2:14 PM | Updated on Jan 30 2024 2:49 PM

Chiranjeevi Fans Wishes On New York Time Square wall - Sakshi

దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని వరించిన రోజు నుంచి ఆయనకు ఎందరో శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా ఎందరో ప్రముఖులు అభినందనలు తెలిపారు. త్వరలో ఒక మెగా ఫంక్షన్‌ను ఏర్పాటు చేసి చిరంజీవిని గౌరవించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇప్పటికే ప్రకటించారు.

నటుడిగా ఎందరినో అభిమానులుగా మార్చుకున్న చిరంజీవికి 2006లో పద్మ భూషణ్‌ అవార్డు వరించింది. తాజాగా మెగాస్టార్‌కు పద్మవిభూషణ్‌ దక్కడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఓ అభిమాని వినూత్నంగా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్‌లోని బిగ్‌స్క్రీన్‌పై చిరంజీవి ఫోటో ప్రదర్శించాడు. ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్‌కు శుభాకాంక్షలు అంటూ తెలిపాడు.

ఇప్పటికే ఎందరో ప్రముఖులు చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ బాలకృష్ణ, రజినీకాంత్, అమితాబ్, కమల్‌ వంటి సీనియర్‌ హీరోలు ఇప్పటికీ అభినందించకపోవడంపై చిరు ఫ్యాన్స్‌ నుంచి విమర్శలు వస్తున్నాయి. వశిష్ఠ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం షూటింగ్‌ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement