సిద్దార్థ్‌ ఎమోషనల్‌ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే! | Sakshi
Sakshi News home page

Chinna Movie: సిద్దార్థ్‌ చిన్నా మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

Published Mon, Oct 16 2023 2:25 PM

Chinna Movie OTT Partner Fixed - Sakshi

సిద్దార్థ్‌.. తమిళ హీరోనే అయినా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాడు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలతో బాక్సాఫీస్‌ హిట్లు కొట్టి ఇక్కడ స్టార్‌ హీరోగా ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ప్రేక్షకులకు కొంత దూరమయ్యాడనే చెప్పాలి. సరైన హిట్‌ కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఎమోషనల్‌ కథను సెలక్ట్‌ చేసుకుని నటించడమే కాక నిర్మాతగానూ మారాడు.

ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్తా'. ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 28న రిలీజైంది. తమిళనాడులో హిట్‌ కొట్టిన ఈ మూవీ తెలుగులో చిన్నా పేరుతో అక్టోబర్‌ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్‌ రాలేదు.

ఇక ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో చిన్నా చిత్రం ఓటీటీలోకి రానుంది. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిమిష సజయాన్‌, సహస్ర శ్రీ, అంజలి నాయర్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

చదవండి:  రైతుబిడ్డ పేరు జపం చేసిన అశ్విని.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Advertisement
 
Advertisement