Chakravyuham Movie Review In Telugu | Ajay | Gnaneswari | Vivek Trivedi - Sakshi
Sakshi News home page

Chakravyuham Movie Review: ‘చక్రవ్యూహం’ రివ్యూ

Jun 2 2023 3:28 PM | Updated on Jun 2 2023 5:33 PM

Chakravyuham Movie Review In Telugu - Sakshi

టైటిల్‌:  చక్రవ్యూహం
నటీనటులు : అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ తదితరులు
నిర్మాత : శ్రీమతి సావిత్రి 
దర్శకత్వం : చెట్కూరి మధుసూధన్
సంగీతం: భరత్‌ మంచిరాజు 
విడుదల తేదీ : జూన్ 2, 2023

చక్రవ్యూహం కథేంటంటే.. 
సంజయ్ (వివేక్ త్రివేది), సిరి(ఊర్వశి పరదేశీ) భార్య భర్తలు. ఒకవైపు పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే బిజినెస్‌లో దూసుకెళ్తుంటాడు సంజయ్‌.  ఓ రోజు ఇంట్లో సంజయ్‌ లేని సమయంలో సిరి దారుణ హత్యకు గురవుతుంది. ఆ మర్డర్‌ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు?  సంజయ్‌ ఫ్రెండ్‌ శరత్‌ని హత్య చేసిందెవరు? ఈ కేసులను సీఐ సత్య ఎలా సాల్వ్‌ చేశాడు?అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
బలమైన కథ, ట్విస్టులు ఉన్నప్పుడే థ్రిల్లర్‌ సినిమాలు ప్రేక్షకులను ఎంగేజ్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీల విషయంలో హత్యలు ఎవరు చేశారనేది చివరి వరకు రివీల్‌ చేయకుండా..  ప్రేక్ష‌కుడి ఊహ‌లు, ఆలోచ‌న‌ల‌కు అందనంతగా కథను తీర్చిదిద్దాలి. ఈ విషయంలో దర్శకుడు మధుసూధన్ కొంతమేర సఫలమయ్యాడు. ఊహించని ట్విస్టులతో కథను ముందుకు నడిపారు. ఫస్టాఫ్‌లో సిరి మ‌ర్డ‌ర్ కావ‌డం, ఆ కేసును చేప‌ట్టిన సీఐ స‌త్య‌, దుర్గ క‌లిసి చేప‌ట్టే సీన్స్  సాదాసీదాగాసాగుతాయి. కేసు విచారణ కూడా ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి. హత్యల వెనుక ఉన్నదెవరు? ఎందుకు హత్య చేశారో రివీల్‌ చేసే సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ఇక సీక్వెల్‌కి ఇచ్చిన లీడ్‌ అజయ్‌ పాత్రపై క్యూరియాసిటీని పెంచుతుంది. మొత్తంగా థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడే వారికి చక్రవ్యూహం నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
సీఐ సత్యగా అజయ్‌ చక్కగా నటించాడు. ఇలాంటి పోలీసు పాత్రలు పోషించడం అజయ్‌కి కొత్తేమి కాదు. సీరియ‌స్ రోల్‌లో అత‌డి డైలాగ్ డెలివ‌రీ, ఎక్స్‌ప్రెష‌న్స్ బాగున్నాయి.  సంజ‌య్‌గా వివేక్ త్రివేది నటన బాగుంది. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న శిల్ప పాత్రలో  ప్రగ్యా నయన్  ఒదిగిపోయింది. . రాజీక్ క‌న‌కాల‌, శుభ‌లేఖ సుధాక‌ర్,ఊర్వ‌శి ప‌ర‌దేశీ, జ్ఞానేశ్వ‌రిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement