పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదిలోనే కాదు..నార్త్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో బీహార్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 నార్త్‌లో కేవలం హిందీలోనే రూ. 812 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో బన్నీకి ఉత్తారాదిలోనూ భారీస్థాయిలో మార్కెట్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెరకెక్కుతోన్న రాకా మూవీపై నార్త్ ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం బిహార్‌లో తీవ్రమైన పోటీ ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటికే 'రాకా' చిత్ర నిర్మాతలను సంప్రదించారని తెలిపింది.
ఈ మూవీ రైట్స్ కోసం భారీ ధర చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారట. ఇదంతా చూస్తుంటే బిహార్‌లో బన్నీకి ఎంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ మూవీ బీహార్‌తో పాటు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు రాకా సినిమాకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.
కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.


