తెలుగు, హిందీలో సినిమాలు చేసిన మెరీనా | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సీరియల్స్‌తో పాటు సినిమాలూ చేసిన మెరీనా

Published Mon, Nov 21 2022 6:49 PM

Bigg Boss Telugu 6: Actress Marina Abraham Sahni BB Entry - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో బుల్లితెర నటి మెరీనా పాల్గొంది. ఆమె పూర్తిపేరు మెరీనా అబ్రహం సాహ్ని. ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్‌ అయిన మెరీనా ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' సీరియల్‌లో నటించింది. 2016లో రొమాన్స్‌ విత్‌ ఫైనాన్స్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సబ్‌ కా దిల్‌ ఖుష్‌ అనే హిందీ చిత్రంలోనూ నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. సీరియల్‌ నటుడు రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ బిగ్‌బాస్‌ హౌస్‌లో జంటగా అడుగుపెట్టారు. కానీ తర్వాత విడివిడిగా గేమ్‌ ఆడారు. మెరీనా బిగ్‌బాస్‌ హౌస్‌కు మదర్‌ ఇండియాగా పేరు తెచ్చుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement