
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్‌మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే గతంలో దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు భయపడేవారు. కానీ ఈ మధ్య తమకు ఇబ్బంది కలిగిస్తే.. మీడియా ముఖంగా వారి పేర్లను బటయపెడతున్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చిస్తూ.. నూతన నటీనటులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపుల గురించి బాహాటంగానే వెల్లడించారు.
తాజాగా డ్యాన్సర్, బిగ్‌బాస్ ఫేం నైనిక కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. చాలామందిలాగానే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యానని చెప్పింది. కమిట్‌మెంట్ ఇస్తే.. సినిమా చాన్స్ ఇస్తామని చాలా మంది అడిగారని, తాను నో చెప్పడంతో వాళ్లంతా మళ్లీ కాల్ చేయలేదని చెప్పింది. తాజాగా ఆమె ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.
‘సినీ ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్‌గా తయారైంది. అందరూ గలీజ్ అయిపోయారు. ఓపెన్‌గానే కమిట్‌మెంట్ అడిగేస్తున్నారు. ఆ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి..‘పర్సనల్ రిక్వెర్‌మెంట్’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలేమో అనుకున్నా. ఓకే చెప్పా. ఆయన మరోసారి ‘పర్సనల్ రిక్వెర్‌మెంట్’ అని చెప్పడంతో నాకు అర్థమైంది. నాకు తెలిసిన వ్యక్తి కావడంతో.. ‘మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్ అయింది’ అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిల వల్లే ఈ ఫార్మెట్ క్రియేట్ అయింది. కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు కూడా. నేను ఆర్టిస్ట్ అయినా కూడా.. ఒకవేళ నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి రానివ్వను. ఈ ఫీల్డ్ మంచిది కాదని చెబుతా’అని నైనిక చెప్పుకొచ్చింది.
ఇక తన తండ్రి గురించి కూడా నైనిక చెప్పుకొచ్చింది. ఆయన తమతో ఉండరని, తానే ఇంటి నుంచి పంపేశానని చెప్పింది. ‘డాడీ మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. అమ్మని టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. ‘నువ్వు ఉంటే నేను ఇంట్లో ఉండను’ అని డాడీతో చెప్పా. ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు. డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. అమ్మ నన్ను చాలా బాగా పెంచింది. కష్టపడి ఆడిషన్స్‌కి తీసుకెళ్లేది. అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను. ఆమెకు ఒక మంచి ఇళ్లు కొనివ్వడమే నా లక్ష్యం’ అని నైనిక చెప్పుకొచ్చింది.
ఢీ షో ద్వారా డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. బిగ్‌బాస్ 8 లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తూనే..ఆర్టిస్ట్‌గానూ ప్రయత్నాలు చేస్తుంది.