సొంతింటి కల సాకారం, మెహబూబ్‌ దిల్‌సే ఎమోషనల్‌ | Bigg Boss Fame Mehboob Dil Se Finally Dream of Owning a House Come True | Sakshi
Sakshi News home page

Mehboob Dil Se: మెగాస్టార్‌ సాయంతో ఇల్లు కట్టిన మెహబూబ్‌, గృహప్రవేశం..

Oct 24 2021 8:01 PM | Updated on Oct 25 2021 8:12 AM

Bigg Boss Fame Mehboob Dil Se Finally Dream of Owning a House Come True - Sakshi

'గుంటూరు మిర్చి'లాంటి కుర్రాడు మెహబూబ్‌ దిల్‌సే. యూట్యూబ్‌, టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన ఇతడు గతేడాది బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే మెహబూబ్‌ ఫ్రెండ్‌షిప్‌కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. బిగ్‌బాస్‌ ద్వారా కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మంచి మిత్రులను, ఎన్నో ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి కంట్లో కూడా పడ్డాడు. 

బిగ్‌బాస్‌ 4 గ్రాండ్‌ ఫినాలేకి ప్రత్యేక అతిథిగా వచ్చిన చిరు.. మెహబూబ్‌ డ్యాన్సింగ్‌ కెపాసిటీకి, ఎనర్జీకి ఆశ్చర్యపోయాడు. సినిమాల్లోకి రావాలన్న మెహబూబ్‌ తపన, ఆరాటం చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుందని ముచ్చటపడిపోయాడు. అతడు అనాథాశ్రమానికి చేసిన సాయాన్ని చూసి అభినందించాడు. అంతేకాదు, మెహబూబ్‌ సొంతింటి కల సాకారం చేయడం కోసం రూ.10 లక్షల చెక్కును బహుమతిగా అందించాడు. మొత్తానికి ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సొంతింటి కల నెరవేరింది.

ఆదివారం కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు మెహు. 'ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్‌ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహబూబ్‌ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ఓ పక్క వెబ్‌సిరీస్‌లు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు మిర్చి వెబ్‌ సిరీస్‌ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది.


చిరంజీవి మెహబూబ్‌కు ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement