Bigg Boss Fame Akhil Sarthak Got Injured And Walked Out From BB Jodi - Sakshi
Sakshi News home page

Akhil Sarthak : గాయంతో షో వదిలేసి వెళ్లిపోయిన అఖిల్‌.. ఈసారి కూడా కప్పు పోయిందే!

Mar 20 2023 2:12 PM | Updated on Mar 20 2023 4:06 PM

Bigg Boss Fame Akhil Sarthak Got Injured And Walked Out From Bb Jodi - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అఖిల్‌ సార్థ్‌క్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రెండుసార్లు(బిగ్‌బాస్‌-4, బిగ్‌బాస్‌ ఓటీటీ)లలో రన్నరప్‌గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అఖిల్‌ ప్రస్తుతం ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో పర్ఫార్మెన్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొని డ్యాన్స్‌ దుమ్మురేపుతున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్‌ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్‌కు ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అఖిల్‌ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. 

ఎప్పటినుంచో నాకు ఈ బాధ ఉంది. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాంగ్‌ పర్ఫెర్మెన్స్‌ చేస్తున్నప్పుడు కూడా నొప్పితోనే చేశాను. నా గాయాలు బయటకు కనపించనందున ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. నా కడుపు కింది భాగంలో తీవ్రవైన నొప్పితో బాధపడుతున్నాను.

ఇప్పటికే ఆలస్యం చేయడంతో అది మరింత నన్ను బాధిస్తుంది. నేను, తేజు మా సాయశక్తులా కష్టపడ్డాం. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను షో నుంచి బయటకు వచ్చేశాను. ఇంకా షాకింగ్‌ విశేషమేమిటంటే మేం బాటమ్‌2లో ఉన్నాం. అయినా ఏం పర్లేదు. మరో అద్భుతమైన షోతో మళ్లీ మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాను అంటూ అఖిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement