Bigg Boss Telugu 6: అమ్మకు ఫిజియోథెరపీ ఆపేశారు, ఎవరూ సాయం చేయట్లేదు.. ఏడ్చేసిన శ్రీసత్య

Bigg Boss 6 Telugu: Sri Satya, Faima, Rohit Parents Surprise Housemates - Sakshi

Bigg Boss Telugu 6, Episode 81: కన్నవాళ్లను చూడగానే అప్పటిదాకా పడ్డ శ్రమనంతా మర్చిపోతున్నారు హౌస్‌మేట్స్‌. 12 వారాల తర్వాత వారు ఎదురుపడటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ఎవరి పేరెంట్స్‌ వచ్చినా ఆతృతగా దగ్గరికెళ్లి పలకరించి వారితో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ అంతలోనే తన కన్నవాళ్లు గుర్తొచ్చి కన్నీళ్లను తుడుచుకుంటున్న కీర్తిని చూసి జాలిపడని వారే లేరు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్‌ హౌస్‌లో అడుగుపెట్టాయో చూద్దాం..

ఈరోజు మొదటగా ఫైమా తల్లి షాహీదా బిగ్‌బాస్‌ హౌస్‌లో హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమె చూడగానే ఫైమా ముఖంలో సంతోషం వెల్లివెరిసింది. తల్లిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేసింది. అందరూ నన్ను ఫైమా వాళ్ల అమ్మ అంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని ఎమోషనలైంది ఆమె తల్లి. అంతలోనే వాతావరణాన్ని కూల్‌ చేసేందుకు రేవంత్‌ను చూస్తే భయమైతుంది అంటూ హౌస్‌మేట్స్‌పై జోకులు పేల్చింది.

ఇక ఫైమాను పక్కకు తీసుకెళ్లిన షాహీదా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ వాడొద్దని చెప్పింది. కోపం, వెటకారం తగ్గించుకోమని శ్రీసత్య, ఇనయలతో జాగ్రత్తగా ఉండమని సూచనలు చేసింది. తర్వాత తన కూతురితో పాటు ఇంటి సభ్యులందరితో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఫైమా తన తల్లిని ఎత్తుకుని తిప్పుతుంటే కీర్తికి తన కన్నవాళ్లు గుర్తొచ్చి ఏడ్చేసింది. అందరిముందు తన బాధను బయపెట్టి వారి సంతోషాన్ని చెదరగొట్టడం ఇష్టం లేక బాత్రూమ్‌లోకి వెళ్లి బోరుమని ఏడ్చింది.

తర్వాత బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను ఫ్రీజ్‌, ఫాస్ట్‌ ఫార్వర్డ్‌, లూప్‌ అంటూ ఓ ఆటాడుకున్నాడు. ఇదే ఛాన్స్‌ అనుకున్న ఇంటిసభ్యులు ఒకరినొకరు ఆటాడుకున్నారు. శ్రీహాన్‌ను ఫ్రీజ్‌ అన్నప్పుడు ఫైమా, శ్రీసత్య అతడికి ఆడవేషం కట్టి ఆటపట్టించారు. తర్వాత శ్రీసత్య తండ్రి గొంతు విని గార్డెన్‌ ఏరియాలోకి పరుగెత్తుకొచ్చింది. తండ్రిని, వీల్‌చైర్‌లో ఉన్న తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. పేరెంట్స్‌ ప్రేమ దక్కినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని సత్యతో చెప్పింది కీర్తి.

ఇక సత్య తండ్రి ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'నువ్వు గేమ్‌ బాగా ఆడుతున్నావు. ఇంత ఎత్తుకు ఎదుగుతావనుకోలేదు. కానీ కోపం, వెటకారం తగ్గించుకోవాలి. మొదటి మూడు వారాలు బాగున్నావు, తర్వాత ఇలా మారిపోయావేంటి? పాత సత్య ఇలా ఉండదు. నువ్వు పిచ్చిపిచ్చి నామినేషన్స్‌ వేశావు, ఇంట్లో ఎవరైనా సరే బలమైన కారణం లేకుండా సిల్లీ నామినేషన్స్‌ వేయొద్దు' అని హెచ్చరించాడు. వాళ్లు వెళ్లిపోగానే సత్య తన తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందింది. అమ్మ కాలు వాసింది, ఏదో భయంగా ఉంది. ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం తండ్రి తన కోసం చేసిన వంటకాలను అందరితో కలిసి పంచుకుంది.

నెక్స్ట్‌ రోహిత్‌ అమ్మ అతడిని వెనక నుంచి వచ్చి కళ్లు మూసి సర్‌ప్రైజ్‌ చేసింది. తల్లిని చూడగానే భావోద్వేగానికి లోనైన రోహిత్‌.. ఆమె పాదాలమీద పడి ఆశీర్వాదం తీసుకుని అమ్మను పట్టుకుని ఏడ్చేశాడు. ఈ సందర్భంగా ఆమె.. నువ్వు ఒకసారి కెప్టెన్‌ అయి మా కలను నెరవేర్చు అని కోరింది. తర్వాత కొడుకుతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసింది. ఇక మెరీనా తనకోసం పంపిన ఫొటోఫ్రేమ్‌ చూసి కంటతడి పెట్టుకున్నాడు రోహిత్‌. రిలేషన్‌లో ఉన్నప్పుడు మొట్టమొదట దిగిన సెల్ఫీ ఫొటో అదేనని ఆ ఫొటో తాలూకు జ్ఞాపకాలను పంచుకున్నాడు రోహిత్‌. రేపటి ఎపిసోడ్‌లో మిగతా హౌస్‌మేట్స్‌ ఫ్యామిలీస్‌ రానున్నాయి.

చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్‌.. ఇప్పుడు రోజూ ఏడుస్తూనే ఉంది
51 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top