
తమిళ నటుడు బాల (బాలకుమార్).. గతేడాది నాలుగో పెళ్లి చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడుముళ్లు వేశాడు. వీరిద్దరి మధ్య 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా.. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ఈ దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. మొట్టమొదటిసారి ఓ లాటరీ గెలిచినట్లు వెల్లడించారు.
మా అదృష్టం.. మొదటిసారి లాటరీ గెలిచాం. ఇదంతా ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. లాటరీ ద్వారా రూ.25 వేల ప్రైజ్‌మనీ లభించింది అని బాలా (Actor Bala) సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ డబ్బును ఏదైనా మంచిపని కోసం ఉపయోగించమని చెప్తూ భార్య చేతికి ఆ డబ్బు అందించాడు.
వైవాహిక జీవితం
తమిళ నటుడు బాలా మలయాళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో టూమచ్, చాప్టర్ 6 సినిమాలు చేశాడు. బాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. ఇతడు 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. ఈ జంట కూడా ఎంతోకాలసం కలిసుండలేదు. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను పెళ్లాడగా ఆమెతోనూ విడిపోయాడు. గతేడాది అక్టోబర్‌లో కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.
చదవండి: ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజేంటి?!