నోరే ఊరేలా... కూరే కావాలా!

Back Door Movie Song Release by vahchef Sanjay Thumma - Sakshi

టేస్టీ టేస్టీ కూరను రుచి చూపించనున్నారు పూర్ణ. ఫుడ్‌ మేళా పెట్టారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.. ‘బ్యాక్‌డోర్‌’ సినిమాలో రుచికరమైన కూర నేపథ్యంలో ఓ పాట ఉంటుంది. సినిమాలో నటీనటులు ఎలాగూ టేస్ట్‌ చేస్తారనుకోండి. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో సతీష్‌ కుమార్‌ సమర్పణలో బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. ఈ చిత్రంలోని రెండో పాట  ‘నోరే ఊరేలా... కూరే కావాలా’ పాటను చెఫ్‌  సంజయ్‌ తుమ్మ చేతుల మీదగా విడుదల చేయించారు. ప్రణవ్‌ స్వరపరచిన ఈ పాటకు చాందిని సాహిత్యం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top