ట్రాన్స్‌జెండర్‌తొ ప్రేమ | Ayushmann Khurrana Chandigarh Ki Aashiqui Movie | Sakshi
Sakshi News home page

విచిత్రమైన ప్రేమ

Oct 28 2020 8:11 AM | Updated on Oct 28 2020 8:11 AM

Ayushmann Khurrana Chandigarh Ki Aashiqui Movie - Sakshi

ఆయుష్మాన్‌ ఖురానా, వాణీ కపూర్‌ జంటగా ఓ సినిమాలో నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘ఛండీఘర్‌ కరే ఆషికీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇదో పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం అని సమాచారం. కానీ ఇందులో ఓ విశేషం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న వాణీ కపూర్‌ ట్రాన్స్‌జెండర్‌ పాత్రధారిగా కనిపిస్తారట. ట్రాన్స్‌జెండర్‌ అయిన వాణీకపూర్‌కీ, ఆయుష్మాన్‌కి మధ్య నెలకొనే విచిత్రమైన ప్రేమ ఈ సినిమాకి హైలెట్‌ అని బాలీవుడ్‌ టాక్‌. తెలుగులో ‘ఆహా కల్యాణం’ చిత్రంలో కథానాయికగా నటించిన వాణీ కపూర్‌ ఆ తర్వాత హిందీ చిత్రాలే చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సరసన ఆమె చేసిన ‘బెల్‌ బాటమ్‌’, రణ్‌బీర్‌ కపూర్‌తో చేసిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement