'అలాంటి వాళ్లను నమ్మొద్దు.. అప్పుడే సంతోషంగా ఉంటాం'

Artist Surekha Vani Shares A Post About  Fake People - Sakshi

నటి సురేఖా వాణి ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన నటనతో పాటు అందంలో కూడా నేటి హీరోయిన్లకు పోటీగా ఉంటుంది సురేఖ. గత కొంతకాలంలో ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకున్నారు. అయితే ఈ మధ్య సురేఖ రెండో వివాహానికి సిద్ధమైందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై  సురేఖతో పాటు ఆమె కూతురు కూడా ఘాటుగా స్పందించారు.

వాస్తవాలు రాయండి..కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రిత. తమపై వచ్చే రూమర్లకు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతుంటారు. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన పోస్ట్‌ మరోసారి ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. ఇందులో నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుంది అంటూ ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందన్నది చెప్పలేదు. దీంతో ఆమె జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలని ఉద్దేశించి సురేఖ వాణి ఆ కామెంట్స్‌ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు సుప్రీతతో కలిసి ఉంటుంది. కూతుర్ని కూడా సినీ సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రోజుకో పోస్ట్‌ పెడుతూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న సుప్రీత..నటన, డ్యాన్సులోనూ శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. 

చదవండి : రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి
బిగ్‌బాస్‌: సురేఖవాణి ఎంట్రీ పై క్లారిటీ!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top