అర్జున్‌ అంబటి ‘పరమపద సోపానం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! | Arjun Ambati Paramapada Sopanam locks April 24 release date | Sakshi
Sakshi News home page

అర్జున్‌ అంబటి ‘పరమపద సోపానం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Apr 10 2026 12:03 AM | Updated on Apr 10 2026 5:55 PM

Arjun Ambati Paramapada Sopanam locks April 24 release date

‘అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్‌ డైరీస్‌’ చిత్రాలు, ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ అర్జున్‌ అంబటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రంలో  జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించారు. నాగ శివ దర్శకత్వంలో గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు తేల‌ప్రోలు, ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ తుది దశకు చేరుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్‌ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించగా, దేవ్‌ జాండ్‌ సంగీతం అందించారు. మరోవైపు రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ కీలక పాత్రలో అర్జున్‌ అంబటి నటిస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement