Actress Aparna Balamurali Reaction To Trolls On Her Over Weight, Deets Inside - Sakshi
Sakshi News home page

Aparna Balamurali: 'లావుగా ఉన్నానని అమ్మ పాత్రలు చేయమని అడుగుతున్నారు'

Published Thu, Sep 15 2022 10:55 AM

Aparna Balamurali Reacts On Trolls About Her Over Weight - Sakshi

తమిళసినిమా: సూరరైపోట్రు చిత్రంలో నటనను చూసి ఫిదా అయిపోయిన తమిళ ప్రేక్షకులు నటి అపర్ణ బాలమురళిని ప్రశంసల్లో ముంచెత్తేశారు. ఆకాశమే హద్దు పేరుతో తెలుగులో అనువాదమైన ఈ చిత్రంతో అక్కడ ప్రేక్షకులను అపర్ణ అలరించింది. అయితే మలయాళంలో ప్రముఖ కథానాయికగా రాణిస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో అంతకుముందే 8 తోట్టాగళ్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సర్వం తాళమయం, తీదుమ్‌ నానుమ్‌ చిత్రాల్లో నటించినా పేరు తెచ్చి పెట్టింది మాత్రం సూరరైపోట్రు సినిమానే.

ఆ తరువాత వీట్లో విశేషం చిత్రంలో నటించింది. అయితే అప్పటికే ఈ అమ్ము లావెక్కిందనే విమర్శలను వచ్చాయి. కాగా ప్రస్తుతం తమిళంలో నిత్యం ఆరుదానం అనే చిత్రంలో అశోక్‌ సెల్వన్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌ పోస్టర్‌ను ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో అపర్ణ బాలమురళి బొద్దుగా ఉన్నట్లు  కనిపించడంతో ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. దీనిపై ఈమె స్పందిస్తూ శరీర బరువుకు, ప్రతిభకు సంబంధమే లేదని తెలిపింది.

తాను లావెక్కానన్న కామెంట్స్‌ రావడంతో మొదట్లో చాలా బాధపడ్డానని, కొందరైతే అమ్మ పాత్రలో నటిస్తావా? అని అడుగుతున్నారని, తనకు అంత వయసు లేదని పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవట్లేదని, ఆరోగ్య సమస్య తదితర ఇతర కారణాల వల్ల శరీర బరువులో మార్పులు జరగవచ్చంది. అయితే తాను ఎలా ఉన్నా చాలామంది అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా బరువుకు, ప్రతిభకు సంబంధం లేదని, స్లిమ్‌గా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు అర్థం కాని విషయమన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement