టీజర్‌లో గ్లాస్‌ డైలాగ్‌.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే? | AP CEO Mukesh Kumar Meena About Ustad Bhagat Singh Teaser | Sakshi
Sakshi News home page

Ustad Bhagat Singh: టీజర్‌లో గ్లాస్‌ డైలాగ్‌.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే?

Mar 20 2024 4:02 PM | Updated on Mar 20 2024 4:49 PM

AP CEO Mukesh Kumar Meena About Ustad Bhagat Singh Teaser - Sakshi

సినిమాలను అడ్డుపెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడన్న వార్తలపై ఈసీ స్పందించింది. ఎవరు ఏ గుర్తయినా ప్రచారం చేసుకోవచ్చు కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపింది. 

అసలేం జరిగింది?
డైలాగులు చెప్తే ఓట్లు రాలవు.. ఈ విషయం పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మాటివ్వడమే కాకుండా మాట మీద నిలబడే సత్తా ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తారు. అంతేకానీ ఆవేశంతో ఊగిపోతూ డైలాగులు చెప్తే ఏం ఫాయిదా ఉండదు. అయినా సరే ఇప్పటికీ రాజకీయాల కోసం సినిమాల మీదే ఆధారపడుతున్నాడు పవన్‌ కల్యాణ్‌. అలా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో తన ప్యాకేజీ పాలిటిక్స్‌ అప్లై చేశాడు. మంగళవారం నాడు ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. ఇందులో తన గ్లాసు గుర్తు గురించి డైలాగ్‌ చెప్పాడు. గ్లాస్‌ అంటే సైన్యం అంటూ సినిమాతో సంబంధం లేని డైలాగులు పలికాడు. టీజరే చప్పగా ఉందంటే.. ఈ అర్థం పర్థం లేని డైలాగులు అవసరమా? అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఈ రకంగా గ్లాస్‌ గురించి ప్రచారం చేసుకోవచ్చా? అన్న ప్రశ్నలు సైతం తలెత్తాయి.  ‘నిర్మాత డబ్బులతో పార్టీ ప్రచారమా?’ అంటూ ‘సాక్షి’ తో పాటు పలు వెబ్‌సైట్లు విశ్లేషణాత్మక వార్తలను రాసుకొచ్చాయి.

పవన్‌ అనుమతి కోరలేదు: ఎన్నికల అధికారి
గ్లాస్‌ డైలాగ్స్‌ ఇష్యూపై ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా టీజర్‌ను చూడలేదని, గాజు గుర్తు ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే తప్పకుండా అనుమతి తీసుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ అయితే ఎటువంటి అనుమతి కోరలేదని, ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement