నన్ను ఇంతలా ఎవరు టార్చర్ చేయలేదు.. అనుపమ ఆసక్తికర కామెంట్స్ | Anupama Parameswaran interesting comments on kishkindapuri director | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: 'హారర్ జోనర్ అంటే ఇష్టం.. ఏ డైరెక్టర్‌ ఇంతలా టార్చర్ చేయలేదు'

Sep 3 2025 8:24 PM | Updated on Sep 3 2025 9:28 PM

Anupama Parameswaran interesting comments on kishkindapuri director

ఇటీవలే పరదా మూవీతో అలరించిన అనుపమ పరమేశ్వరన్మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె హీరోయిన్గా నటించిన హారర్ మూవీ కిష్కింధపురి. చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

రిలీజ్తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే కిష్కింధపురి ట్రైలర్ను విడుదల చేశారు. ఈవెంట్కు అనుపమ పరమేశ్వరన్ కూడా హాజరయ్యారు. సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హారర్ ఫిల్మ్స్అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. నా జుట్టును చూసే ఇలాంటి సినిమాలు వచ్చాయని అనుపమ నవ్వుతూ మాట్లాడింది.

అనుపమ మాట్లాడుతూ..'నాకు హారర్ జోనర్ సినిమాలంటే ఇష్టం. నా మూడేళ్ల వయసు నుంచే హారర్ మూవీస్ చూశా. నా జుట్టు చూసే అవకాశాలు వచ్చాయి అనుకుంటా. కౌశిక్ నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. అతను చెప్పిన ఫ్లో నాకు నచ్చింది. కౌశిక్తో పని చేయడం అద్భుతంగా అనిపించింది. స్క్రిప్ట్పై ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి. డబ్బింగ్స్టూడియోలో ఇంతలా నన్ను టార్చర్చేసిన తెలుగు డైరెక్టర్ మరెవరూ లేరంటూ' నవ్వుతూ చెప్పారు. కాగా.. సినిమాకు కౌశిక్ పెగళ్ల దర్శకత్వం వహించారు. మూవీ సెప్టెంబర్‌ 12 థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement