కందుల సులోచనగా అనుపమ.. కొత్త మూవీ పోస్టర్‌ విడుదల | Anupama Parameswaran's first look released from Bhogi movie | Sakshi
Sakshi News home page

కందుల సులోచనగా అనుపమ.. కొత్త మూవీ పోస్టర్‌ విడుదల

Apr 30 2026 11:47 AM | Updated on Apr 30 2026 11:51 AM

Anupama Parameswaran's first look released from Bhogi movie

శర్వానంద్‌ భోగి సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్‌ లుక్‌ తాజాగా విడుదల చేశారు. 1960 నేపథ్యంలో సాగే ఈ కథకు అనుగుణంగా ఆమె లుక్‌ ఉంది. ఇప్పటికే శర్వానంద్‌ లుక్‌ను కూడా మేకర్స్‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి', బైకర్‌ చిత్రాలతో జోరు మీదు ఉన్న శర్వా.. హ్యాట్రిక్‌పై కన్నేశాడు. భోగి సినిమాతో తప్పకుండా హిట్‌ కొట్టాలని ఆయన ఉన్నారు. ఈ మూవీని దర్శకుడు సంపత్‌ నంది తెరకెక్కిస్తున్నారు.

భోగి మూవీలో కందుల సులోచన రాణి పాత్రలో అనుపమ కనిపించనుందని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌ అనుపమ(Anupama Parameswaran) తన సాధారణ ఇమేజ్‌కు భిన్నంగా ఉంది. బోల్డ్, డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించడంతో ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.  పోస్టర్‌తో పాటు చిత్ర యూనిట్‌ ఇలా ఒక క్యాప్షన్‌ కూడా చేర్చింది. "ప్రకృతి బిడ్డ... గంగా నిలయం... కందుల గర్వం...  భోగికి ప్రాణం" అని అనుపమ గురించి వర్ణించారు.

ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్‌ స్టోరీని పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement