‘యానిమల్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Sakshi
Sakshi News home page

Animal Twitter Review: ‘యానిమల్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే.. ?

Published Fri, Dec 1 2023 7:06 AM

Animal Movie Twitter Review In Telugu - Sakshi

‘అర్జున్‌రెడ్డి’సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సందీప్‌రెడ్డి వంగ. అదే సినిమాను కబీర్‌సింగ్‌ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత సందీప్‌ చాలా గ్యాప్‌ తీసుకొని ‘యానిమల్‌’సినిమాను తెరకెక్కించాడు.

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ చిత్రం ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యానిమల్‌ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు  ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

యానిమల్‌ చిత్రానికి ఎక్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని ఎక్కువ మంది చెబుతున్నారు. రణ్‌బీర్‌, అనిల్‌ కపూర్‌, రష్మిక, బాబీ డియోల్‌ల నటన అదిరిపోయిందంటున్నారు. వయోలెన్స్‌ ఎక్కువైందని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రలో బిగ్‌డే ఇది. సినిమాటిక్ మ్యాజిక్ ఊహించబోతున్నాం. ఈ సినిమా అద్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ రోజు డబుల్ ధమాకా. సలార్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతున్నది. నాకు డబుల్ ఎక్సైట్‌మెంట్ అంటూ ఓ నెటిజన్ ట్విట్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌ చాలా బాగుంది. కర్‌బీర్‌ కపూర్‌ని ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. అతనికి సందీప్‌ వంగ మంచి పాత్రను ఇచ్చాడు. ప్రతి పాయింట్‌ బాగుంది. సెకండాఫ్‌ కోసం ఎదురు చూస్తున్నానంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్‌ బ్లాక్‌ బస్టర్‌. ఇలాంటి పాత్రలో రణ్‌బీర్‌ని ఎప్పుడు చూడలేదు. అతని కెరీర్‌లో బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు’అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. 

Advertisement
Advertisement