రొమాన్స్‌ సీన్‌లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా | Sakshi
Sakshi News home page

రొమాన్స్‌ సీన్‌లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా

Published Mon, Dec 25 2023 11:48 AM

Andrea Jeremiah Comments On Romance Scenes - Sakshi

కోలీవుడ్‌ నటి ఆండ్రియా ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీ మొదట్లో గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత కథానాయకిగా తెరపైకి వచ్చారు. ఆమె పాడిన పాటలు చాలా వరకు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఆమె గాయని మాత్రమే కాదు..  డబ్బింగ్‌లో కూడా మెప్పించారు. పలు చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పిన ఆండ్రియా.. కందా నాల్ ముదల్ చిత్రం ద్వారా 2005 తెరపై కనిపించింది.

హీరోయిన్‌గా కొనసాగుతూనే పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. కార్తీ  యుగానికి ఒక్కడు చిత్రంలో ఆండ్రియా ఒక పాట పాడటమే కాదు అందులో చాలా హాట్‌గా కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. విశ్వరూపం, తడాఖా, ఉత్తమ విలన్, వడ చెన్నై, మాస్టర్ వంటి చిత్రాల్లో మెప్పించింది. నటిగా తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ.. ప్రస్తుతం పాన్‌ ఇండియా కథానాయకగా రాణిస్తుంది.

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వడ చైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్‌కు భార్యగా ఆండ్రియా  ఛాలెంజ్‌ ఉన్న పాత్రలో నటించింది. తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూసే ఆమె అందుకోసం తనను తాను మార్చుకునే పాత్రలో అందరినీ మెప్పించింది.  దీని గురించి ఆండ్రియా ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ వడచైన్నె చిత్రంలో ఒక రొమాన్స్‌ సన్నివేశంలో నటించడానికి తానేం సిగ్గు పడలేదని తెలిపింది. షూటింగ్‌లో భాగంగా కెమెరాల ముందు చేస్తున్న రొమాన్స్‌కు కూడా  దర్శకుడు అమీర్‌ చాలా సిగ్గు పడ్డారని ఆమె పేర్కొంది. ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా తాజాగా మిష్కిన్‌ దర్శకత్వంలో ఆండ్రియా ప్రధాన పాత్ర పోషించిన పిశాచి– 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement