Lasya Manjunath: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించింది. ఈ క్రమంలో ప్రేమ పెళ్లి చేసుకున్న లాస్య అనంతరం యాంకరింగ్ గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. అలాగే యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. గురువారం(మార్చి 16న)లాస్య భర్త మంజునాథ్ బర్త్‌డే. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తపై ప్రేమ కురిపిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ
‘హ్యాపీ బర్త్‌డే మంజునాథ్.. నువ్వు నన్ను నవ్వించావు. నా కన్నీళ్లు తుడిచావు. నన్ను గట్టిగా హత్తుకున్నావు. నా సక్సెస్‌ను చూశావు. నా వైఫల్యాలను చూశావు. ఎలాంటి సమయంలోనైన నా పక్కనే నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు. లవ్ యూ’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఓ పర్పెక్ట్ హస్బెండ్‌కు భార్యగా గర్వపడుతున్నానంటూ లాస్య భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఆమె ఫ్యాన్స్‌ని, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. మంజునాథ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ క్యూట్ కపుల్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వార్తలు