బేబీ కాంబో రిపీట్.. ఎపిక్ టీజర్‌ చూశారా? | Anand Devarakonda and vaishnavi Chaitanya Epic Teaser out now | Sakshi
Sakshi News home page

Epic Teaser: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఎపిక్.. టీజర్ రిలీజ్

Apr 29 2026 6:27 PM | Updated on Apr 29 2026 6:42 PM

Anand Devarakonda and vaishnavi Chaitanya Epic Teaser out now

బేబీ మూవీ జోడీ మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతోన్న మూవీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకు 90s ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ డేస్, కెరీర్‌ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండనున్నట్లు టీజర్‌లో అర్థమవుతోంది. ఈ చిత్రంలో శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement