కరోనా నుంచి కోలుకున్న బిగ్‌ బి | Amitabh Bachchan discharged after testing negative for COVID-19 | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకున్న బిగ్‌ బి

Aug 3 2020 12:48 AM | Updated on Aug 3 2020 12:48 AM

Amitabh Bachchan discharged after testing negative for COVID-19 - Sakshi

కరోనా నుంచి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షలో కోవిడ్‌ నెగటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు అమితాబ్‌. ఈ విషయాన్ని అభిషేక్‌ తన ట్విట్టర్లో తెలిపారు.  ‘నాన్నగారు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇక నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. ఆయనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు.

నేను ఇంకా కోవిడ్‌  పాజిటివ్‌గానే ఉన్నాను.  మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కరోనాను జయించి ఆరోగ్యంగా బయటకు వస్తాను’’ అని అన్నారు అభిషేక్‌. అమితాబ్‌ మాట్లాడుతూ –’’ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశాను. దేవుడి దయ, నా ఆప్త మిత్రులు, స్నేహితులు, అభిమానుల ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆసుపత్రిలో వైద్య బృందం సహకారం వల్ల త్వరగా కోలుకోగలిగాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement