ప్రతిష్టాత్మక అవార్డ్‌ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను తాజాగా ప్రకటించారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నిలిచారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్‌గా దినేశ్ విజన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్ మాస్సే, నితాన్షీ గోయెల్ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఆర్ రెహమాన్ నిలిచారు.
Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official
My warm congratulations to all the winners across categories this year.
A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…— Allu Arjun (@alluarjun) November 2, 2025


