వెకేషన్‌ మోడ్‌ | Allu Arjun Switches To Vacation Mode, Heads To Paris Amid Raka Movie Shoot Break | Sakshi
Sakshi News home page

Allu Arjun: వెకేషన్‌ మోడ్‌

May 27 2026 12:13 AM | Updated on May 27 2026 10:59 AM

Allu Arjun enjoying his vacation

వెకేషన్‌ మోడ్‌ ఆన్‌ చేశారు అల్లు అర్జున్‌. కొద్ది రోజులుగా ‘రాకా’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ కాస్త సేద తీరేందుకు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్యారిస్‌లో ఉన్నారని తెలిసింది. వచ్చే నెల ప్రారంభంలో ఇండియాకు వస్తారు అల్లు అర్జున్‌. ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ వచ్చే నెలలో ముంబైలో ప్రారంభం కానుంది.

సినిమాలో కీలకమైన ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తోపాటు ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌ దీపికా పదుకోన్‌  ఓ ప్రధానపాత్రలో నటిస్తున్నట్లుగా యూనిట్‌ ఆల్రెడీ ప్రకటించింది. ఇంకా హీరోయిన్స్‌ రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్‌ కూడా భాగం కానున్నారని సమాచారం.

పునర్జన్మల కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్‌ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement