అల్లు అర్జున్- అట్లీ సినిమా పోస్టర్‌ విడుదల | Allu Arjun And Atlee Upcoming Film Sparks Buzz With Cryptic Poster Ahead Of Title Launch, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్- అట్లీ సినిమా పోస్టర్‌ విడుదల

Apr 7 2026 11:45 AM | Updated on Apr 7 2026 1:06 PM

Allu Arjun And Atlee movie New poster out now

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబినేషన్‌ సినిమా (AA22xA6) నుంచి అప్ డేట్ వచ్చింది.  తాజాగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఒక క్రూర మృగం పంజా (చెయ్యి) మాత్రమే కనిపిస్తోంది.

ఈ సినిమాలో తోడేలు చేయి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుంది.  హాలీవుడ్ ప్రమాణాలతో అల్లు అర్జున్‌ నుంచి ఒక భారీ ప్రయోగాన్ని అట్లీ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఒక వింత శక్తి ఉన్న పాత్రలో  లేదా ఇలాంటి వింత జీవులతో పోరాడే పాత్రలో  కనిపిస్తారని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌పై సోషల్‌ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి పలు వివరాలు ప్రకటిస్తారని సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement